ఏదైనా ముఖ్యమైన పని ఉందంటే మనం అవసరం అయినా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మన వెంట తీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఫైల్ లో అన్నిటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకుని తీసుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. దానితో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని సాఫ్ట్ కాపీ రూపం లో ఉంచచ్చు. వాటికి అనుమతి కూడా ఉంటోంది. ఆ డాక్యుమెంట్‌కు డిజిటల్ రూపంలో వున్నా కూడా వాటికి అనుమతి ఇస్తోంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం అనుమతి ఇచ్చే ఫార్మాట్ లోనే ఉండాలి అవి.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్‌ని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసి మీరు ఎలా అవసరమో అలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ పద్దతి మరెంత ఈజీ అయ్యింది. మీ వద్ద కేవలం వాట్సప్ ఉంటే చాలు. మీ వాట్సప్ లోనే ఈ డాక్యుమెంట్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మైగవ్ హెల్ప్ డెస్క్ కొంత కాలం క్రితమే వాట్సప్ ద్వారా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని డౌన్‌లోడ్ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. దీని కోసం దగ్గర డిజీలాకర్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. డిజీ లాకర్ లోని మీ డాక్యుమెంట్స్‌ని వాట్సప్ ద్వారా సులువుగా డౌన్‌లోడ్ చేసేందుకు అవుతుంది. దాని కోసం ఇలా చేయండి.
మీ స్మార్ట్‌ఫోన్‌లో MyGov Helpdesk నెంబర్ +91 9013151515 ని సేవ్ చేసుకోండి.
ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి MyGov Helpdesk నెంబర్ సెర్చ్ చేసేసి. హాయ్ అని మెసేజ్ చేయండి.
తర్వాత డిజీలాకర్ సర్వీసెస్, కోవిన్ ఆన్ వాట్సప్ అని రెండు ఆప్షన్స్ కనపడతాయి.
డిజీలాకర్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఈ అకౌంట్‌కు లింక్ అయ్యాక 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసేయండి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి.
ఇక్కడ సేవ్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ మీ ఛాట్ బాట్ లో కనిపిస్తాయి.
కావాల్సిన డాక్యుమెంట్ లేదా ఐడీ కార్డ్ ని ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేయొచ్చు.