కీలక విషయం లో  వై ఎస్ జగన్ సలహా కోరిన కే‌సి‌ఆర్ ?

-

తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. మార్చి 26న ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి నలుగురు మరియు తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఆశావహులు రెండు తెలుగు రాష్ట్రాలలో అధ్యక్షులను ప్రసన్నం చేసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే శాసన మండలి రద్దు చేసిన క్రమంలో ఇద్దరు మంత్రి పదవులు కోల్పోయిన తరుణంలో వారిద్దరిలో ఒకరిని ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు పేర్లు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో అయితే నిజామాబాద్ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయిన కెసిఆర్ కూతురు కవిత నీ రాజ్యసభకు పంపాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క కే కేశవరావును గాని అదేవిధంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ కానీ పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీలో టాక్.

 

మరోపక్క  రాజ్యసభ సభ్యత్వానికి కవిత అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. కానీ ఆమెను రాష్ట్రంలో కంటే జాతీయ స్థాయి రాజకీయాలకు మాత్రమే పంపించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూతురు కవిత విషయంలో జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిలో వైయస్ జగన్ సలహాని కే‌సి‌ఆర్ కోరినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version