చదువు అయిపోయిందా…? నూటికి కోటి శాతం ఖాళీగా అస్సలు ఉండొద్దు…!

-

ఈ రోజుల్లో ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా కష్టంగా మారాయి… చదువులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య పెరగడం, ఉద్యోగాల సంఖ్య తగ్గడం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా చదువుకుని కాలేజీ నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య దేశం మొత్తం లక్షల్లో ఉంటుంది. వాళ్ళకు చదువు వస్తుందో రావడం లేదో పక్కన పెడితే… సర్టిఫికేట్ పట్టుకుని మాత్రం బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది ఉద్యోగాలు దొరకడం లేదని, తమ చదువుకి తగిన ఉద్యోగం లేదని ఉద్యోగాలు చేయలేకపోతున్నారు.

అలాంటి వారికి నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు చదువు పూర్తి అయి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టావు అంటే నీ వ్రుత్తి జీవితం, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, మరొకటి అయినా సరే మొదలైనట్టే… నువ్వు సంపాదించినా సంపాధించకపోయినా… ఉదాహరణకు నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదివి… మంచి మార్కుల తో కాలేజి నుంచి బయటకు వచ్చి కాళీగా సరైన ఉద్యోగం దొరకలేదని… ఆరు నెలలు కాళీ గా ఉండి 7వ నెల ఏదోక ఉద్యోగానికి వెళ్తే… ఈ ఆరు నెలలు ఏం చేసావనే ప్రశ్న వినపడుతుంది.

నేను కాళీ గా ఉన్నాను అని చెప్తే నీలో ప్రతిభ లేదనుకుంటాడు… సరే ఇంట్యర్వ్యులకు వెళ్లాను కాని ఉద్యోగం దొరకలేదు అన్నా సరే… నీలో విషయం లేదనుకుంటాడు… కాబట్టి కాళీ గా ఉండటం అనేది మంచి విధానం కాదు… నీకు నెలకు మూడు వేలు వచ్చినా, నాలుగు వేలు వచ్చినా సరే… ఏదోక ఉద్యోగం చేయడమే ఉత్తమం… బయటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నా హోదా ఇది… నేను ఈ ఉద్యోగం ఎందుకు చెయ్యాలి అంటే… అంతే సంగతులు… లేదా కాళీగా లేకుండా ఏదైనా కోర్స్ అయినా తీసుకోవడమే ఉత్తమం…

ఈ రోజుల్లో బయటి పరిస్థితులు మనం అనుకున్నంత సులభంగ లేవనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది… ఏదైనా చిన్న వ్యాపారం అయినా సరే సరికొత్త గా ఆలోచించి చేయడం అనేది ఉత్తమం… ఒక్కసారి మీరు కాళీ గా ఉన్నారు అంటే… ఎందుకు కాళీ గా ఉన్నారు అనే ప్రశ్నతోనే ప్రతీ ఇంటర్వ్యు ఉంటుంది… మీరు చెప్పే సమాధానం మీకు సరిగా అనిపించినా ఉద్యోగం ఇచ్చే వాడు మాత్రం సవా లక్ష ఆలోచిస్తాడు… కాబట్టి చదువు అయిన తర్వాత కాళీ గా ఉండటానికి ఎంత మాత్రం ఇస్తాపడకండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version