కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న భారతీయులకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ప్రజలు సంఘీభావం తెలిపారు. పాకిస్తాన్‌లో #IndiaNeedsOxygen, #PakistanStandsWithIndia, #IndiaFightsCovid వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో భారత్ కు అండగా నిలుస్తున్నారు. భారతదేశానికి సహాయం చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలను విజ్ఞప్తి చేసారు. కరోనా అనేది ఒక సవాల్ అన్నారు ఇమ్రాన్ ఖాన్.
అందరం కలిసి పోరాడితే మంచి ఫలితాలు ఉంటాయని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. మా దేశంలో భారత్ కోసం ప్రార్ధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ… భారత్ కు అండగా ఉంటామని, ఈ కష్ట సమయం నుంచి భారత్ త్వరగా బయటపడుతుందని అన్నారు. అయితే ఆ దేశంలో కూడా ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) ఆక్సీజన్ కొరత వలన ఆపరేషన్ లు వాయిదా పడుతున్నాయని చెప్పింది.