ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకీ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. గత వారం రోజుల నుండి రోజుకి రెండు వేల కేసులు పైన నమోదు అవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ గడచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాలను తెలపగా, ఏకంగా 3963 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని 994 కేసులు నమోదు అవ్వడం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రభుత్వ అధికారులు గడచిన 24 గంటల్లో మొత్తం 23,872 శాంపిల్స్ ను పరీక్షించగా 3963 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 1411 మంది కరోనా బారినుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఏకంగా 52 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 18/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 41,714 పాజిటివ్ కేసు లకు గాను
*19,223 మంది డిశ్చార్జ్ కాగా
*586 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,905#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rb6RQCyWLJ— ArogyaAndhra (@ArogyaAndhra) July 18, 2020