ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు.. దర్శక నిర్మాతలకు.. సంగీత కళాకారులకు ఇలా వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ఆస్కార్ అవార్డును అందజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చాలా ఘనంగా అమెరికన్ టైం ప్రకారం మార్చి 12న జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన చిన్న చిన్న వీడియో క్లిప్స్ మాత్రమే ట్విట్టర్ వేదికగా సందడి చేస్తున్నాయి అయితే ఆస్కార్ అవార్డు ఎవరు సొంతం చేసుకున్నారు చేసుకున్నారు అని విషయం తెలియాలి అంటే ఇండియన్ టైం ప్రకారం మనం ఇంకా ఎదురు చూడాల్సి ఉంటుంది.
ఇకపోతే ఎట్టకేలకు లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న ఈ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం చాలా రాయల్ లుక్ లో కనిపించి సందడి చేసింది. ముఖ్యంగా వీరందరిలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది తారక్ మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ షూట్ లో.. లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైన ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గర్జిస్తున్న పులి బొమ్మను చంకీలతో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. రెడ్ కార్పెట్ పై నడవడానికి ఎన్టీఆర్ ఇలా ప్రత్యేకంగా తన సూట్ డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
రెడ్ కార్పెట్ పై అలా నడుచుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ను చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా స్టన్ అయిపోయారు. ఆయన రాయల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి అయితే ఎన్టీఆర్ రాయల్ లుక్ కి కు సంబంధించిన ఫోటోలు.. ఆస్కార్ వేదిక నుంచి బయటకు రాగా ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.
Wooow indian proud stars just met in red carpet their bonding never ends #Oscars #alwaysramcharan#RamCharanBossingOscars #jrntr #RRRForOscars pic.twitter.com/TDmoxbW1aS
— Rana journo (@Prathap91646674) March 13, 2023