2022లో బోల్తా పడిన చిత్రాలు ఇవే.. !

0
122

ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.. అందులో ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం…

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది..అలాగే డైరెక్టర్ రాధాకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన రాధేశ్యామ్ నిరాశను మిగిల్చింది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది.. అక్కినేని నాగచైతన్య, రాశి కన్నా నటించిన థాంక్యూ సినిమా విజయం అందుకోలేకపోయింది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించాడు. అవికా గోర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 22న విడుదలైంది.

అలాగే నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం పరాజయం చవిచూసింది. సినిమా ట్రైలర్, పాటలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపైఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. అదే విధంగా మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో పోటీ పడుతూ వచ్చిన కింగ్ నాగార్జున ది గోస్ట్ చిత్రం సైతం డిజాస్టర్ గా మిగిలిపోయింది.. అలాగే ఈ ఏడాది వచ్చిన ఖిలాడి, రంగ రంగ వైభవంగా, నేను మీకు బాగా కావాల్సినవాడిని, సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.