ఇన్‌క‌మ్ ట్యాక్స్ ర‌ద్దు చేయాలి : బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సంచ‌ల‌నం

-

బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సంచ‌ల‌న డిమాండ్ తెర పైకి తెచ్చాడు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ప‌త‌నం అవుతుంద‌ని అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వం అండ‌గా ఉండాల‌ని.. అందుకు అనుగూణంగా ఇన్‌క‌మ్ ట్యాక్స్ వ‌సూల్ ను నిలిపి వేయాల‌ని ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇన్ కమ్ ట్యాక్స్ ను రద్దు చేయ‌డ‌మే ఉత్త‌మం అని ఆయ‌న అన్నారు.

కాగ ఒక మీడియా ఛాన‌ల్ కు ఎంపీ సుబ్రహ్మ‌ణ్య స్వామి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి గా ఉంటే ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని స్వామిని ప్ర‌శ్నించిగా.. ముందుగా తాను ఇన్ క‌మ్ ట్యాక్స్ ను ర‌ద్దు చేస్తాన‌ని స‌మాధానం ఇచ్చారు. ప‌రిస్థితులు చ‌క్క బడేంత వ‌ర‌కు ర‌ద్దు చేస్తాన‌ని అన్నారు. దాని త‌ర్వాత ఇన్ క‌మ్ ట్యాక్స్ ర‌ద్దును శాశ్వ‌తంగా కొన‌సాగించ‌డంపై ఆలోచ‌న చేస్తాన‌ని ఆయ‌న అన్నారు. కాగ ఈ విష‌యంపై ఇప్ప‌టికే ప‌లు సార్లు ప్ర‌భుత్వానికి స‌ల‌హా ఇచ్చాన‌ని అన్నారు. ఇన్ క‌మ్ ట్యాక్స్ నుంచే కాకుండా ఇత‌ర మార్గాల నుంచి ప్ర‌భుత్వం ఆదాయం పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version