BREAKING : తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు… 14% పెంచుతూ నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈ ఆర్ సి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యుత్ బిల్లు | electricity bill | Power Bill

డొమెస్టిక్ పై 40 నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీల పై యూనిట్ టు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

19 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరగా… 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే… తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల పై భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version