రాష్ట్రంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. జ‌గ‌న్ ముందున్న ప‌రిష్కారం ఇదొక్క‌టే..!

-

“దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఊహించ‌ని దానిక‌న్నా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ, మ‌న ద‌గ్గ‌ర మా త్రం కేవ‌లం 10 కేసులు మాత్ర‌మే న‌మోదు కావ‌డం ఒకింత సంతోషించ‌ద‌గ్గ విష‌యం“- అంటూ సీఎంగా జ‌గన్ చేసిన ప్ర‌క‌ట‌న ఇంకా చెవుల్లో వినిపిస్తుండ‌గానే రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రో మూడుకు పెరి గిపోయింది. నిజానికి దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినా.. ఉద‌యం ఆరు నుంచి మ‌ద్యాహ్నం 1 గంట వ‌ర‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వారి దైనందిన కార్య‌క్ర‌మాల‌కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన వారివ‌ల్ల ఇబ్బంది లేద‌ని అనుకున్నా.. ఇప్పుడు రా ష్ట్రంలో ప‌రిస్థితి చేయి దాటే ప్ర‌మాదం పొంచి ఉంద‌నేది నిపుణుల మాట‌. అంతేకాదు, తెలంగాణ ఉదంతం కూడా ఇదే ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతోంది. అక్క‌డ 20 కేసులు న‌మోదు అయ్యే వ‌ర‌కు ప్ర‌బుత్వం సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఆ త‌ర్వాత క‌నిపిస్తే చాల్చేయ‌మంటారా? అంటూ సీఎం కేసీఆర్ ఆగ్ర‌హించారు. మ‌రి అలాంటి ప‌రిస్థితి ఇక్క‌డ రాకూడ‌ద‌ని అనుకుంటే.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లుగా సీఎం కొన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. వీటివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేద‌ని కూడా గ్ర‌హించాలి.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో చూద్దాం. ఒక‌టి కీల‌క‌మైన అంశం. ఇప్ప‌టికే విదేశాలు లేదా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌స్తున్న‌వారికి క్వారంటైన్ నిర్బంధం అమ‌లు చేస్తున్నారు. మంచిదే. అయితే, రాష్ట్రంలో ఇప్ప‌టికే క‌రోనా బాధిత జిల్లాలుగా ఉన్న విశాఖ‌, ప్ర‌కాశం, చిత్తూరు(తిరుప‌తి), కృష్ణా, తూర్పుగోదావ‌రి జిల్లాల స‌రిహ‌ద్దుల‌ను పూర్తిగా మూసేయాలి. ఆ ఏరియాల నుంచి పురుగును కూడా బ‌య‌ట‌కురాకుండా చూడాలి. లేదంటే.. వ్యాప్తి మ‌రింత పెరిగి.. ఇప్పుడు ఎలాంటి కేసులు లేని మిగిలిన 8 జిల్లాల‌లోనూ ప‌రిస్థితి చేయిదాటే అవ‌కాశం ఉంటుంది.

అదేవిధంగాఇప్పుడు ఉద‌యం ఆరు నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లించిన క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని ఓ గంట కుదించాలి. అంటే ఉద‌యం ఆరు నుంచి 12కు ప‌రిమితం చేయాలి. అంతేకాదు, ఈ విష యంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోవాలి. అది ఒకింత ఇబ్బంది క‌లిగించినా అమ‌లు చేయ‌క త‌ప్ప‌దు. అదే.. రోజు విడిచి రోజు మాత్రమే ఈ విధానం అమ‌లు చేయాలి. దీనివ‌ల్ల ఆదిలో కొన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌లు కూడా హైరానా ప‌డ‌కుండా వైర‌స్‌ను పూర్తిగా నియంత్రించే అవ‌కాశం ఉంటుంది. ఈ రెండు విష‌యాల‌ను సీరియ‌స్‌గా అమ‌లు చేయ‌డం ద్వారానే వైర‌స్ వ్యాప్తిని నిరోధించే అవ‌కాశం ఉంటుంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version