భారత్​లో పెరిగిన విదేశీ పెట్టుబడులు

-

భారత్‌లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) భారీగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ సంవత్సరంలోని గడచిన 6 నెలల్లోనే 15 శాతం పెట్టుబడులు పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. 6 నెలల్లో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) ఫారెన్ ఇన్వెస్టిమెంట్స్ వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి.

fdi

గత ఆర్థిక సమయంలో ఇదే కాలంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యిందని.. కరోనా సమయంలోనూ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయన్న విషయం విధితమే. ఈ ఆర్థిక సంవత్సరం పుంజుకోవడానికి ముఖ్య కారణం అంబానీ కంపెనీల్లోకి వచ్చిన భారీ పెట్టుబడులే అని చెప్పడంలో ఎటువంటి ఎంతో దోహదం చేశాయని చెప్పుకోవాలి.. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం రంగాలవారీగా చూస్తే టాప్ 10లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సాఫ్టువేర్, హార్డ్‌వేర్ రంగాలు ముందున్నాయి. మిగతా 9 రంగాల్లో పెట్టుబడులు తగ్గినట్టు వెల్లడించారు.

రాష్ట్రాలవారీగా వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిశీలిస్తే.. గుజరాత్‌కు 16 బిలియన్ డాలర్లు రాగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక ఉన్నట్టు పేర్కొన్నాయి. సర్వీసుల రంగానికి 17 శాతం పెట్టుబడులు వచ్చాయి.. వీటిలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్ సోర‍్సింగ్ రంగాలు కలసి ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్టువేర్, హార్డ్​వేర్ విభాగానికి 12 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి. టెలికం రంగానికి 7 శాతం, మహారాష్ట్రకు 20 శాతం, కర్ణాటకకు 15 శాతం, ఢిల్లీకి 12 శాతం చొప్పున విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు కొన్ని సర్వేలు వెల్లడించాయి.

దీనిపై స్పందించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. దేశంలోఎఫ్ డీఐలకు అనువైన వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని.. దానితోనే ఎఫ్​డీఐలు ఈ ఆర్థిక ఏడాదిలో వెల్లువెత్తుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version