కరోనా ఎఫెక్ట్‌.. ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు..!

-

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి వన్డే ధర్మశాలలో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దైంది. ఇక రెండో వన్డే లక్నోలో, మూడో వన్డే కోల్‌కతాలో జరగాల్సి ఉన్నాయి. కానీ కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. దీంతో సఫారీల జట్టు తిరిగి స్వదేశానికి వెళ్లనుంది. ఈ మేరకు సౌతాఫ్రికా టీం ఢిల్లీ నుంచి తమ సొంత దేశానికి తిరుగు ప్రయాణం కానుంది.

కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అనుమతినివ్వబోమని ఆయా రాష్ట్రాలు తేల్చి చెప్పిన క్రమంలో ఇప్పటికే ఐపీఎల్‌ టోర్నీని వాయిదా వేశారు. ఏప్రిల్‌ 15వ తేదీ తరువాత టోర్నీ భవితవ్యం తేలనుంది. అయితే ఇంతలోనే భారత్‌, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌ను ఐపీఎల్‌కు ముందు మళ్లీ కొనసాగిస్తారా, లేదా అన్నది సందేహంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version