ఇండియాలో కొత్త‌గా 7,992 క‌రోనా కేసులు.. 559 రోజుల త‌ర్వాత ఇదే మొద‌టి సారి

-

చైనా దేశంలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్… అనేక రంగాలను కుదిపేసింది. ఇక మన ఇండియాలోనే ఈ కరోనా మహమ్మారి.. కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం… దేశంలో కరోనా మహమ్మారి కేసులు కాస్త పెరిగాయి.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా… కొత్తగా 7,992 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే… గడిచిన 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా.. ఏకంగా.. 393 మంది మ‌ర‌ణించారు. అలాగే.. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,277 గా న‌మోదు అయింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత త‌క్కువ‌గా న‌మోదు కావ‌డం 559 రోజుల త‌ర్వాత ఇదే మొద‌టి సారి. ఇక నిన్న ఒక్క రోజే… 9,265 మంది క‌రోనా నుంచి పూర్తి గా కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా… 131.99 కోట్ల మందికి.. క‌రోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. ఇక ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version