ఏపీ లో కొత్తగా 184 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే చిత్తూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కో మరణం సంభవించింది. ఇక గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 134 మంది కోలుకున్నారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,72, 909 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 442 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2149 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 56 , 318 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 25, 925 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3 , 04 , 17, 082 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version