గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగానే తగ్గాయి. ఇక మన దేశంలో బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా భారీగానే తగ్గింది. నిజానికి గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ పోతుంది. ఈరోజు కూడా అలాగే రెండు ధరలూ తగ్గాయి.
హైదరాబాద్ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటి మీద రూ.290 క్షీణించింది. దీంతో ₹51,340కు తగ్గింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గుదలతో ₹47,000కు దిగింది. ఇక నిన్న ఒక్క రోజే కేజీ వెండి ధర భారీగా అంటే ₹1,600 దాకా తగ్గింది. దీంతో వెండి ధర ₹66,700కి చేరుకుంది.