కయ్యానికి కాలుదువ్వుతున్న దాయాది పాకిస్తాన్‌ను భారత్ అదును చూసి దెబ్బకొడుతోంది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి ఏకంగా డ్రోన్స్, మిసైల్స్ తో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకపడింది. సుమారు వందకు పైగా ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించారు. అనంతరం పాక్ జరిపిన మిసైల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని దీటైన బదులు చెప్పింది.
మొన్నటి వరకు సింధూనదిని పాక్ కు వెళ్లకుండా ఆపిన భారత్.. ప్రస్తుతం చీనాబ్ నది నీళ్లకు అడ్డుకట్ట వేస్తూనే ఒకేసారి విడుదల చేస్తూ పాక్ ను వరదలతో ముంచెత్తుతోంది. తాజాగా మరోసారి భారత్.. శనివారం తెల్లవారు జామున జమ్మూలోని బాగ్లిహార్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని ఒక్కసారిగా కిందకు వదిలింది. ఎందుకంటే చీనాబ్ నది నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టు కు ముప్పు పొంచి ఉన్నందున గేట్లను అధికారులు ఎత్తివేశారు.