ఇండియా,ఆస్ట్రేలియా సెకండ్ టీ20..కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ రచ్చ

-

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలిస్తుండగా.. టీమిండియా ముందు భారీ టార్గెట్‌ని ఆస్ట్రేలియా నిలిపింది. కెప్టెన్ మాథ్యూవెడ్,స్టీవ్‌స్మిత్ చెలరేగిపోయారు. ఇండియా ఆటగాళ్లు కూడా అదే రేంజ్ లో ఆడుతున్నారు. 13 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి118 పరుగులు చేసింది. కోహ్లి,సంజు శాంసన్ క్రిజ్ లో ఉన్నారు.

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ పై మాత్రం రచ్చ రచ్చ అవుతోంది. తొలి టీ20లో రవీంద్ర జడేజా బదులు చాహల్‌ను ఆడించడంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. రెఫరీ చాహల్‌ను ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా మాజీలు మాత్రం.. ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా రవీంద్ర జడేజాకు బదులు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంపై క్రికెట్‌ వర్గాల్లో వివాదం నెలకొంది. కంకషన్‌ నిబంధనలకు కట్టుబడే భారత్‌ వ్యవహరించిందని పలువురు మాజీలు సమర్ధిస్తుండగా.. పలువురు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన జడేజా.. టీమిండియా 160 ప్లస్‌ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సమయంలోనే అతడి హెల్మెట్‌కు బంతి తాకి గాయానికి గురయ్యాడు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో ఆడలేదు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత బీసీసీఐ వైద్య బృందం జడేజాను పరిశీలించి మిగిలిన ఆటలో పాల్గొనలేడని స్పష్టం చేయడంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ రిఫరీకి విషయం తెలియజేసింది. వెంటనే చాహల్‌ను కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. మ్యాచ్‌ను ఇండియావైపు టర్న్‌ చేశాడు. 3 వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version