ఇండియా ప్రస్తుతం వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కు చేరుకోవడంతో కప్ కొట్టాలన్న కసితో ఉంది. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా తెలివిగా జట్టును లీడ్ చేస్తున్నాడు. కాగా ఈ వరల్డ్ కప్ తర్వాత ఇండియా వెంటనే మూడు రోజుల గ్యాప్ తో ఆస్ట్రేలియా లాంటి భయంకరమైన టీం ను ఢీ కొట్టనుంది. ఈ రెండు జట్ల మధ్యన అయిదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరగనుంది. ఈ షెడ్యూల్ ను చూస్తే, మొదటి మ్యాచ్ నవంబర్ 23న విశాఖపట్టణంలో జరగనుంది. రెండవ మ్యాచ్ ను నవంబర్ 26న త్రివేండ్రంలో జరిపించనున్నారు. అదే విధంగా నవంబర్ 28న మూడవ మ్యాచ్ ను గౌహతి లో జరిపించడానికి పూనుకున్నారు. ఇక మిగిలిన ఆఖరి రెండు మ్యాచ్ లను వరుసగా డిసెంబర్ 1 మరియు 3 వ తేదీలలో నాగ్ పూర్ మరియు హైదరాబాద్ వేదికలలో జరిపించడానికి ప్లాన్ చేశారు.
ఇక ఈ మ్యాచ్ లకు అటు ఆస్ట్రేలియా నుండి కానీ, ఇటు ఇండియా నుండి కానీ కీలక ప్లేయర్లు రెస్ట్ తీసుకోనున్నారు.