తెలంగాణలో ఈనెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మజ్లీస్‌తో అంటకాగుతున్న కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ జట్టుగాను.. బీజేపీని భారత జట్టుగా అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్లు అని వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం ఇలా మాట్లాడడం సరైంది కాదన్నారు. కేంద్ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పోగానే కార్పోరేటర్‌గా మారిపోయి మాట్లాడుతుంటారని విమర్శించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని, ఆయన ప్రవర్తన కోడ్‌కు విరుద్ధంగా ఉందని ఎంపీ చామల స్పష్టంచేశారు.