83 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్.. 243 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.

-

వన్డే వరల్డ్‌ కప్‌లో భారత జైత్రయాత్ర అప్రతీహాతంగా సాగుతోంది. వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్‌ ముందు సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలుగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా భారత్‌.. 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా షమీ, కుల్దీప్‌ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆ జట్టులో మార్కో జాన్సెన్‌ 14 పరుగులతో టాప్ స్కోరర్‌. సొంతగడ్డపై భారత బౌలర్లు మరింత ప్రమాదకరంగా మారుస్తున్నారు.

మ్యాచ్ మ్యాచ్‌కి పురోగతి సాధిస్తున్నారు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను పరుగులు చేయనివ్వడం కాదు కదా! క్రీజులో నిలవనివ్వడం లేదు. రెండ్రోజుల క్రితం మిత్రం దేశం శ్రీలంకను 55 పరుగులకే కుప్పకూల్చి వారిని తలెత్తుకోనీకుండా చేశారు. నేడు(ఆదివారం) కోల్‌కతా గడ్డపై దక్షిణాఫ్రికా ఆటగాళ్లను అలానే భయపెట్టారు. ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్న సఫారీ బ్యాటర్లను 83 పరుగులకే కుప్పకూల్చారు.సఫారీ బ్యాటర్లలో 14 పరుగులు చేసిన మార్కో జెన్‌సెన్ టాప్ స్కోరర్. నాలుగు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉన్న క్వింటన్‌ డికాక్‌(5) పరుగులకే వెనుదిరగగా.. టెంబా బవుమా (11), మార్క్‌రమ్‌ (9), హెన్రిచ్‌ క్లాసెన్‌(1), వాండర్ డస్సెన్(13), మిల్లర్(11), కేశవ్ మహరాజ్(7) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. షమీ, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version