ఇచ్చిన హామీల్లో 50 శాతం నెరవేర్చినా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది : రాజ్ నాథ్ సింగ్

-

కాంగ్రెస్ పై డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ లోని గౌచర్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ర్యాలీలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. పౌరి లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ బలూని తరఫున రాజ్ నాథ్ సింగ్ ప్రచారం చేశారు.ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఇండియా బలమైన దేశంగా మారిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.ప్రపంచ వేదికలపై ఇండియా తన వాణిని బలంగా వినిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేల మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి రప్పించారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం దేశానికి కావాల్సిన రక్షణ పరికరాలను ఇక్కడే తయారు చేస్తున్నామని అన్నారు. గత ఏడు సంవత్సరాలలో రక్షణ రంగ ఎగుమతుల్ని రూ. 600 కోట్ల నుంచి రూ. 21,000 కోట్లకు పెంచామని వెల్లడించారు.

బీజేపీ తాను చెప్పిన హామీలను యథాతథంగా అమలు చేస్తుందని తెలిపారు. ఇందుకు నిదర్శనం పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు,అయోధ్య రామ మందిరం అని అన్నారు.కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో 50 శాతం నెరవేర్చినా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఉండేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version