అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు.వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో టెక్ పాలసీ అడ్వైజర్‌గా సుబ్రహ్మణ్యం పనిచేసిన విషయం తెలిసిందే. కాగా, 2020లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వర్జీనియా నుంచి సెనెట్‌కు ఎన్నికయ్యారు.
ఇక భారత సంతతికి చెందిన మరో నేత రాజా కృష్ణమూర్తి సైతం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో గెలుపొందారు. ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం ఢంకా మోగించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్‌ను దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో ఫస్ట్ టైం ఆయన అక్కడినుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు.సెలక్ట్ కమిటీ ఆన్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగానూ పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.