Asia Cup 2022 : ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ టెర్రరిస్టులు ?

-

ఆసియా కప్ లో భాగంగా ఈనెల 28న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగిన భారీ క్రేజ్ ఉంటుంది. పైగా చాలా కాలం నుంచి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగటం లేదు.

ఈ క్రమంలో గతం కంటే మరింత ఎక్కువ హై క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ వార్ లు జరుగుతుంటాయి. మ్యాచ్ కు కొన్ని రోజుల ముందు నుంచే ఈ సోషల్ మీడియా వార్ మొదలైపోయింది. ఈ క్రమంలోనే ఒక పాకిస్తాన్ జర్నలిస్టు టీమిండియా క్రికెట్ అభిమానులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

‘క్రికెట్ పై జరిగే చర్చల్లో ఇండియన్ ఫ్యాన్స్ అజ్ఞానంగా వ్యవహరిస్తుంటారు. మా బోర్డు రిచ్ బోర్డు అంటూ మొత్తుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా బాబర్ అజమ్, షాహిన్ ఆఫ్రిదీలను చూసి కుళ్లుకుంటూ ఉంటారు. ఇతర దేశాలు క్రికెట్ ఆడేందుకు పాకిస్తాన్ వస్తే సహించలేరు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిజమైన వెర్బల్ టెర్రరిస్టులు’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version