జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు

-

ఇంగ్లాండ్ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత సాధించాడు.  సొంత గడ్డపై 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా జెమ్స్ అండర్సన్ చరిత్రకెక్కాడు. 2002లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అండర్సన్ 2003లో జింబాబ్వే తో తొలి టెస్ట్ ఆడాడు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తో స్వదేశంలో 100 టెస్టుల మార్కును అందుకున్నాడు.

23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. సచిన్ సొంత గడ్డపై 94 మ్యాచ్ లు మాత్రమే ఆడి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అండర్సన్ 40 ఏళ్లు ఒక వైపు వయసు మీద పడుతున్న తన బౌలింగ్ లో మాత్రం పదును తగ్గడం లేదు.

ఇప్పటివరకు తన 19 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో 174 టెస్టులాడిన అండర్సన్ 658 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక మణికట్టు మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఆసిస్ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ (708 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version