పర్యాటకానికి గేట్లు తెరవనున్న ఇండియా.. స్మారక కట్టడాలు, మ్యూజియం సందర్శనకు అనుమతులు..

-

భారతదేశంలోని స్మారక కట్టడాలు, మ్యూజియం, చారిత్రాత్మక ప్రదేశాల సందర్శనకు పురావస్తు శాఖ అనుమతు,లు జారీ చేసింది. సెకండ్ వేవ్ కారణంగా స్మారక కట్టడాలను సందర్శించే అవకాశం లేకుండా పోయింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు నెలల పాటు సందర్శన స్థలాల గేట్లు మూసివేసారు. తాజాగా ఈ గేట్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వ శాఖ జూన్ 16వ తేదీ నుండి సందర్శనకు అనుమతులు ఇచ్చింది.

స్మారక కట్టడాలు, మ్యూజియం మొదలగు వాటిని సందర్శించాలనుకున్న వారు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలనీ, ఆఫ్ లైన్లో టికెట్లు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ నిర్ణయంతో తాజ్ మహల్, అజంతా గుహలు, ఎర్రకోట తదితర తలుపులు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుండి భారతదేశంలోని అన్ని సందర్శన ప్రదేశాలు మూతబడ్డాయి. ఈ మేరకు పురావస్తు శాఖ అన్ని సందర్శన ప్రదేశాలకు ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ మొదటి వేవ్ తర్వాత తెరుచుకున్న ఈ ప్రదేశాలకు, అనేక నియమ నిబంధనల మధ్య సందర్శకులను అనుమతించారు. మొదటి వేవ్ కారణంగా వందకి పైగా రోజులు మూసి ఉన్నాయి. మార్చ్ 17వ తేదీన మూతబడ్డ ఈ ప్రాంతాలు జూన్ 6వ తేదీన తెరుచుకున్నాయి. తాజ్ మహల్ అయితే దాదాపు ఆరు నెలల పాటు మూతబడి ఉంది. సంవత్సరానికి 70-80లక్షల మంది సందర్శించే ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ లో ఉండడం వల్ల సెప్టెంబరులో తెరుచుకుంది. అది కూడా రోజుకి 5వేల మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version