ప్రపంచమంతా ఓ వైపు కరోనా దెబ్బకు గజగజ వణుకుతుంటే.. మరోవైపు కొందరు మాత్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత దరిద్రమంటే.. ఓ వైపేమో విదేశాలకు వెళ్లి వచ్చామంటారు.. ఉన్నత చదువులు చదివామంటారు.. కానీ ఆదిమ మానవుల్లా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారి వల్ల వారి చుట్టూ ఉన్నవారు కరోనా బారిన పడాల్సి వస్తోంది.
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని.. ఇండియాకు వస్తారు.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని చెబితే.. పెడచెవిన పెట్టి.. విందులు వినోదాల్లో మునిగి తేలుతారు. ఈ క్రమంలో వారి వల్ల ఇతరులకు కరోనా వస్తోంది. దేశంలో ప్రస్తుతం ఈ తరహా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అలాంటి వారిని చూస్తే నిజంగా జనాలకు కడుపులో మండి పోతోంది. అసలు వారిని ఇండియాకు ఎందుకు రానిచ్చారు..? అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. వారిపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. జనాలు మండి పడుతున్నారు. నిజంగా.. విదేశాల నుంచి వచ్చి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని చూస్తుంటే.. వారిని ఏమనాలో అస్సలు అర్థం కావడం లేదు.
ఒకరి నుంచి మరొకరికి కరోనా చాలా వేగంగా, సులభంగా వ్యాప్తి చెందుతుందని.. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఓ వైపు దేశ ప్రధాని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.. కొందరు ప్రవర్తిస్తున్న తీరుకు జనాల్లో చిర్రెత్తుకొస్తుంది. అసలు వీళ్లు మన తోటి మనుషులేనా..? ఎందుకు ఇలా నీచంగా, దరిద్రంగా ప్రవర్తిస్తున్నారని.. జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఇండియాకు రాకుండా ప్రభుత్వాలు ముందుగానే కట్టడి చేసి ఉంటే బాగుండేదని జనాలు అభిప్రాయపడుతున్నారు.
విదేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది బాగా చదువుకున్న వారు.. ధనికులే ఉంటారు.. అయితే వారు బుద్ధిలో మాత్రం లేకితనాన్ని ప్రదర్శిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇంటి పట్టున ఉండకుండా.. పార్టీలకు తిరుగుతూ అందరికీ కరోనాను అంటిస్తున్నారు. వీరి వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు కరోనా సోకుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిపై ఇప్పటి వరకు నిజానికి ప్రభుత్వాలు కొంత మర్యాదగానే ప్రవర్తించాయి. కానీ ఇక ముందు కఠినంగా వ్యవహరిస్తే తప్ప.. వారి ప్రవర్తనలో మార్పు రాదని ప్రజలు అంటున్నారు. కరోనా మహమ్మారి ఓ వైపు ప్రజలను కబళిస్తుంటే.. విదేశాల నుంచి వచ్చిన కొందరు మాత్రం తాము విదేశాల నుంచి వచ్చామనే విషయం దాచి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అసలు నిజానికి కేవలం లాక్‌డౌన్ చేయడం ఒక్కటే సరిపోదు.. ఇలాంటి వారిని గల్లీ గల్లీ తిరిగి వెదికి పట్టుకుని మరీ ఒక రేంజ్‌లో పోలీసులు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. ఇలాంటి వారు ఇంటి నుంచి కాలు బయట పెడితే కాల్చి వేసే విధంగా చట్టం తేవాలి. అప్పుడు గానీ ఇలాంటి వెధవలకు బుద్ధి రాదు.
దేశమంతా ఓ వైపు కరోనాకు భయపడుతుంటే.. వీరు మాత్రం బుద్ధి లేకుండా.. విందులు, వినోదాల్లో మునిగి తేలుతూ.. అసలు మాకు ఇతర ప్రపంచంతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించకపోతే లాక్‌డౌన్ విధించి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ముందు ముందు వీరి వల్లే కరోనా ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ప్రజలారా.. బహు పరాక్.. మీ ఇంటి దగ్గర ఇలాంటి వారు ఉంటే ఏమాత్రం వెనుకాడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదంటే మీరు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరుతారు.. తస్మాత్ జాగ్రత్త..!
— మహేష్ బి రెడ్డి.