శ్రీహరి కోట నుంచి రేపు తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం

-

దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌లో సౌండ్‌ రాకెట్‌ కాంప్లెక్సు నుంచి రాకెట్‌ను ప్రయోగించనుండగా శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు.

దీన్ని హైదరాబాద్‌లోని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసింది. 12నే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక శాస్త్రవేత్తలు వాయిదా వేస్తూ 18న ముహూర్తం నిర్ణయించారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు నేడు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ రానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version