మొదలైన Infinix Note 12 pro Sale.. ఇక షురూ చేసేయండి..!

-

ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ సేల్‌ ఇండియాలో ప్రారంభమైంది. అదే ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్‌ ద్వారా ఫోన్‌ కొనుగోలు చేయొచ్చు.. ఇది కూడా బడ్జెట్‌ ఫోనే.. ఫోన్‌ ఫీచర్స్‌, కెమెరా క్వాలిటీ ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి.!

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది.
అల్ఫైన్ వైట్, టస్కనీ బ్లూ, వొల్కానిక్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ అందించనున్నారు.

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో పనిచేయనుంది.
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది.
ఆక్టాకోర్ 6 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కూడా ఇందులో ఉంది.
యాంబియంట్ లైట్ సెన్సార్, జీ సెన్సార్, గైరోస్కోప్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా ఉంది.

స్టోరేజ్‌, బ్యాటరీ సామర్థ్యం..

256 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version