ఓర్ని..ఇదేం ఐడియా రా బాబు.. వీడియో వైరల్..

-

మనుషులకు ఈ మధ్య అతి తెలివి ఎక్కువ అయ్యింది.శృతి మించిన ఆలోచనలు చేస్తూ చూసే జనాలకు పిచ్చేక్కిస్తున్నారు.ఒక్కో మనిషి ఒక్కోలా ఆలొచిస్తున్నారు.అవి బయటకు వచ్చినప్పుడు జనాలు తెగ ఆశ్చర్య పోతున్నారు..దేశంలోని కొందరు క్రియేటర్స్ కార్లు మొదలుకొని హెలికాప్టర్ల వరకూ అన్నింటినీ తయారు చేసేస్తుంటారు..అందులో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని మాత్రం జనాలను విపరీతంగా నవ్విస్తున్నాయి..

ఈ క్రమంలో ఓ వ్యక్తి చెరుకు రసాన్ని తీసెందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.దాన్ని చూసిన వారంతా నోర్లు వెల్లబెడుతున్నారు.అతని వింత ఐడియాకు సంభందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

బైక్ సాయంతో చెరుకు రసం తీయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఓ వ్యక్తి బైక్‌కు పొడవాటి కర్రను కట్టి, దానితో అతను గుండ్రంగా తిరుగుతుండగా, మధ్యలో ఒక యంత్రం నుండి చెరకు రసం తీయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. దీనిని చూసినవారంతా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను చూసి లైకో కామెంట్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version