మార్నింగ్ టిఫెన్ అంటే.. ఎంతసేపు..దోశలు, ఇడ్లీలు, ఉప్మాలే కాదు.. కాస్త వెరైటీగా చేసుకుందాం అంటే..ఊతప్పం వైపు చూస్తారు. అవును ఇది కూడా బాగుంటుంది కానీ., వీటిని చేయడానికి పిండి రుబ్బాలి, పులియబెట్టాలి చాన కథ ఉంటది.. ఈరోజు మనం ఇన్సెస్టెంట్‌గా రాగి ఊతప్పం ఎలా చేయాలో చూద్దామా..!
రాగి ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
రాగిపిండి ఒక కప్పు
పుట్నాల పొడి అరకప్పు
ఓట్స్ అరకప్పు
పొట్టుతియ్యని పెసరప్పు పావుకప్పు
పుల్లమజ్జిగ ఒక కప్పు
వేరుశనగపప్పులు ముక్కా చెక్కా పావుకప్పు
సోంపు ఒక టేబుల్ స్పూన్
మిరయాలపొడి ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు ముక్కా చెక్కా ఒక టీ స్పూన్
కరివేపాకు కొద్దిగా
తయారు చేసే విధానం..
పొట్టుతియ్యని పెసపప్పు తీసుకుని కడిగేసి మిక్సీజార్‌లో వేసుకుని ముక్కా చెక్కాల గ్రైండ్ చేసుకొండి. ఒక బౌల్ తీసుకుని అందులో రాగిపిండి, పుట్నాలపప్పు పొడి, ఓట్స్ వేసి పుల్లమజ్జిగతో కలుపుకోండి. అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరప్పు , సోంపు, మిరియాలపొడి, ఎండుమిరపకాయలు ముక్కా చెక్కా, వేపించిన వేరుశనగపప్పులు, కరివేపాకు వేసి బాగా కలుపుకొండి. కొంచెం పలుచగానే చేయండి.!
చిన్నసైజు నాన్‌స్టిక్ గుంటల ఉన్న పాన్ తీసుకుని మీగడ రాసి అందులో ఈ పిండి వేయండి. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు మళ్లీ కాల్చుకొని తీసేయడమే.. ఇందులో ఫైబర్ ఎక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటుంది. ఊతప్పాన్ని కూడా హెల్తీగా తినే మార్గమిది..ఎప్పుడూ ఒకటే పద్దతిలో కాకుండా.. ఈ సారి ఊతప్పాలను ఇలా ట్రే చేయండి.!