ఈ ఇన్సూరెన్స్లు గురించి మీకు తెలుసా..?

-

మెడికల్ ఇన్సూరెన్స్ తో పాటు ఇతర ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. అయితే హోమ్ ఇన్సూరెన్స్, సైబర్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఉన్నయ్యి. అయితే అవి ఏమిటి..?, ఎలా ఉపయోగపడతాయి..? ఇలా అనేక విషయాలు చూద్దాం..!

హోమ్ ఇన్సూరెన్స్ గురించి చూస్తే… గృహాలు, ఇతర నిర్మాణాలకు సైతం ఇన్సూరెన్స్ పాలసీలు అందించే కంపెనీలు చాల వున్నాయి. ఎక్కువగా ఆపదలకి గురి అయ్యే చోట ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. సహజ విపత్తుల కారణంగా ఆకస్మిక౦గా వాటిల్లే నష్టాన్ని ఇలాంటి పాలసీలు భర్తీ చేస్తాయి.

అదే పే ఆస్ యూ యూజ్ (Pay as you use) ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అంటే..? ఇది ఒక రకం మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్. సాధారణ మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకవేళ ‘పే యాజ్ యు డ్రైవ్’ పాలసీ తీసుకుంటే ఈ భారం తగ్గుతుంది. ప్రయాణించిన దూరంపై ఇన్సూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుంది.

సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటంటే..? కంపెనీలు డేటా భద్రత కోసం సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటాయి. సైబర్ నేరగాళ్లు కంపెనీల డేటాను దొంగలించి డబ్బు వసూలు చేసే ప్రయత్నాల్లో చేస్తారు. అందుకు డేటా సెక్యూరిటీకి భరోసా ఇస్తుంది. ఇలా ఈ ఇన్సూరెన్స్ బాగా కంపెనీలకి ఉపయోగ పడుతుంది.

బైట్ సైజ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే… కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ ఇది. ఎన్నో కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. అతి తక్కువ ప్రీమియంతో ఇలాంటి పాలసీలు తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news