లక్నోలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

-

యూపీ రాజధాని లక్నోలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌(జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జేపీఎన్‌ఐసీ‌లోకి తమను వెళ్లనివ్వకుండా యోగి సర్కార్ తమను అడ్డుకుంటోందని సమాజ్‌‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ ఆరోపించారు. దీంతో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

అఖిలేష్ యాదవ్ టిన్ షీట్‌లపై ‘సమాజ్‌వాదీ పార్టీ జిందాబాద్’ అని నినాదాలు రాశారు. జేపీఎన్ఐసీ గేట్ ముందు కొందరు కార్మికులు టిన్ షీట్లను ఏర్పాటు చేస్తున్న క్లిప్‌ను కూడా సమాజ్‌వాదీ పార్టీ సోషల్ మీడియాల ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘పనికిరాని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి చేస్తోంది.ప్రభుత్వం లక్నోలో నిర్మించిన జేపీఎన్ఐసీ వంటి అభివృద్ధి పనులను నాశనం చేసి గొప్ప వ్యక్తులను అవమానించింది. సోషలిస్టులు ఈ నియంతలకు తలవంచరు’అని ఎస్పీ పార్టీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.ఇదిలాఉండగా, అక్టోబర్ 11న జయ ప్రకాష్‌ నారాయణ్‌ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్‌ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌గేట్‌ వద్ద పోలీసులు రెండు అడ్డు తెరలను ఏర్పాటు చేయడంపై అఖిలేష్‌ సీరియస్ అయ్యారు. యోగి సర్కార్ ప్రజలకు తెలికుండా ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version