ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయబోతున్న అఖిల్….??

-

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ కొత్త సినిమా ఓకే చేసినట్లు ఫిలింనగర్ టాక్‌. అఖిల్‌ సినిమాతో ఎంట్రి ఇచ్చిన అఖిల్‌ హలో, మిస్టర్‌ మజ్నుతో పర్వాలేదనిపించాడు. అఖిల్‌ అకౌంట్‌లో ఇప్పటివరకు సరైన హిట్ లేదనే చెప్పొచ్చు. అందగాడు, డాన్స్‌, ఫైట్స్‌లో ఇరగదీసే సత్తా ఉన్నా.. ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ కాలేకపోయాడు. ఇదే విషయంలో నాగార్జున, అమల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ డ్రామా మూవీలో హీరోగా నటిస్తున్నాడు అఖిల్‌.

interesting News On akhil akkineni next movie

దాని తరువాత ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలో నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం తమిళ్ లో శివకార్తికేయన్ హీరోగా పి ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా “హీరో”. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మిత్రన్ తో కలిసి అఖిల్ ఒక భారీ యాక్షన్ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల కార్తికేయన్ మరియు మిత్రన్ లకు హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ప్రత్యేక విందు ఇచ్చిన అఖిల్, అదే సమయంలో మిత్రన్ చెప్పిన ఒక అద్భుతమైన స్టోరీకి పచ్చజండాగా ఊపినట్లు తెలుస్తోంది.

అయితే ఆ స్టోరీ నచ్చిన అఖిల్, వెంటనే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారట. కాగా నిన్నటితో ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అవడంతో, నేడు దర్శకుడు మిత్రన్ అఖిల్ ని కలిసి పూర్తి కథ నరేషన్ ఇచ్చారని, అతి త్వరలో వారిద్దరి కాంబోలో తెరకెక్కబోయే సినిమా విషయమై అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. ఇక ఈ భారీ యాక్షన్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, అక్కినేని ఫ్యాన్స్ కి ఇది పండుగ వార్తే అని చెప్పక తప్పదు…!!

Read more RELATED
Recommended to you

Exit mobile version