తిరోగ‌మ‌నంలో బీజేపీ… ఈ ఫొటో చెపుతోన్న నిజం

-

పెరుగుట విరుగుట కొర‌కే అన్నది తెలుగు నానుడి. ఇది భార‌తీయ జ‌న‌తా పార్టీకి అన్వ‌యిస్తే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దేశాన్ని కాషాయికీర‌ణ‌గా మార్చాల‌ని, కాంగ్రెస్‌ను దేశం నుంచి త‌రిమివేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న మోదీ షా ద్వ‌యం క‌ల‌లు నెర‌వేర‌లా క‌న‌బ‌బ‌డ‌టం లేద‌ని పేర్కొంటున్నారు. ఒక‌ప్పుడు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ నానాటికి ప్ర‌జ‌ల విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని ప్రాంతీయ పార్టీల‌కు అప్ప‌చెబుతోంద‌ని అంటున్నారు.

దీనికి తోడు బీజేపీతో అనేక ప్రాంతీయ‌, జాతీయ పార్టీల మైత్రి బంధం కూడా తెగుతుండ‌టంతో ఆ పార్టీకి రానున్న కాలం గ‌డ్డు ప‌రిస్థితులనే ముందు ఉంచనుంద‌ని వాద‌న వినిపిస్తున్నారు. దేశంలోని గోవా, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఢిల్లీ, మిజోరం, మేఘాల‌య‌, నాగాలాండ్‌, పుదుచ్చేరి, త్రిపుర‌, మిజోరం, మ‌ణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాల‌తో పాటు ఇటీవ‌ల కొత్త‌గా ఏర్ప‌డిన జ‌మ్ము కాశ్మీర్‌ల‌ను ప‌క్క‌న పెడితే…తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు, అస్సాం,పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, జార్ఖండ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, బీహార్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌ను పెద్ద రాష్ట్రాలుగా ప‌రిగ‌ణిస్తుంటారు.

ఇక పెద్ద రాష్ట్రాల‌ను ప్రామ‌ణికంగా తీసుకుంటే పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్త‌స్‌ఘ‌డ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, బీహార్‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, కేర‌ళ‌, ఓడిషా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పాగ వేశాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, క‌ర్నాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, అస్సాం, జార్ఖండ్ బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఇందులో క‌ర్నాట‌క‌లో బీజేపీ త‌న రాజ‌కీయ నీతిజ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగింది. ఈ పార్టీకి ఆ రాష్ట్రంలో పూర్తి బ‌ల‌మైతే లేద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన గ్రాప్ కూడా మ‌హారాష్ట్ర ప‌రిణామం త‌ర్వాత బాగా వైర‌ల్ అవుతోంది.

అంటే వాస్త‌వికంగా బీజేపీకి కేవ‌లం ఆరు పెద్ద రాష్ట్రాల్లోనే బ‌లం ఉంద‌ని చెబుతున్నారు. బీజేపీకి ప్ర‌జ‌లు దూర‌మ‌వుతున్నార‌నే దానికి ఇదే నిద‌ర్శ‌మ‌ని వారు వాదిస్తున్నారు. బీజేపీ ఎంత ఎగిసిప‌డ్డ ఒక్క విష‌యాన్ని మాత్రం గుర్తుంచుకోవాల‌ని పార్టీల‌ను పూర్తిగా తుడిచేస్తామ‌నుకోవ‌డం వారి భ్ర‌మే అవుతుంద‌ని చెబుతున్నారు. రాజ‌కీయాల్లో అంధ‌పాతానికి అగ్ర‌భాగానికి చేరుకోవ‌డం అన్న‌ది ప్ర‌జ‌ల విశ్వాసంపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version