కొఠారు అబ్బయ్య చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నిక ల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించిన వైసీపీ యువ నాయకుడు. అయితే, ఆయన రాజకీయాలకు కొత్తే అయినా.. సీనియర్ మోస్ట్‌ల మాదిరిగా ప్రజలతో అవినాభావ సంబంధాలు పెట్టుకున్నారు. వారిలో ఒకరిగా మారిపోయారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా.. నే నున్నానం టూ.. ఆయన ముందున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ చేరువ కావడం కొఠారు ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. ప్రజల మధ్య, ప్రజల వెంట, ప్రజల కోసం అనే రేంజ్‌లో కొఠారు చేస్తున్న రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
రాజకీయంగా చూసుకున్నా.. వ్యక్తిగతంగా చూసుకున్నా.. ప్రజలకు కొఠారు చేరువ అవుతున్న తీరు నభూ తో అంటున్నారు దెందులూరు ప్రజలు. సమస్యలు తనను వెతుక్కుంటూ వచ్చే వరకు కూడా కొఠారు ఆగ డం లేదు. తానే సమస్యలను వెతుక్కుంటూ వెళ్తున్నారు. తీరిక లభించినప్పుడల్లా గ్రామాల్లోనూ మండల ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. అక్కడి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యారు.
ప్రతి ఒక్కరిని పలకరించడం వారి సమస్యలు వినడం వంటివి కొఠారు నిత్యకృత్యంగా మారిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలోనూ ప్రజలకు కొఠారు అన్నివిధాలా అండగా నిలిచారు. వారి సమ స్యలు తెలుసుకుంటున్నారు. తాను స్వయంగా పేదలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇక, స్థానికంగా ప్రధాన సమస్యగా మారిన తాగునీటి సమస్యను కొఠారు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించడంలో కూడా కొఠారు చాణిక్యం ఎంతో పనిచే స్తోంది.
రాజకీయాలంటే.. కొందరితో కయ్యం.. కొందరితో వియ్యం. అన్న చందంగా ఉంటే కష్టమని భావించిన కొఠారు ప్రతి ఒక్కరికీ చేరువలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగానే స్థానిక ఎన్నికల్లో చాలా వరకు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఏదేమైనా.. గతానికి భిన్నంగా కొఠారు.. తొలిసారి గెలిచినా.. తన సత్తా చాటుతున్నాడని, పరిణితి చెందిన నాయకుడుగా ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.