రజనీకాంత్ ‘చంద్రముఖి’కి చిరంజీవికి ఉన్న సంబంధమిదే.. ఈ చిత్రంలో స్నేహ స్థానంలో జ్యోతిక..!!

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఫిల్మ్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. రజనీ కెరీర్ లో సూపర్ హిట్ ఫిల్మ్ గా నిలిచిన ఈ పిక్చర్..కు పి.వాసు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సంబంధమేంటి..? ఇందులో కీలక పాత్ర కోసం తొలుత స్నేహను అనుకోగా, ఆ పాత్రలోకి జ్యోతిక వచ్చిందా? అనే విషయాలు తెలుసుకుందాం.

రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఫిల్మ్ కు సీక్వెల్ కూడా స్టార్ట్ అయింది. ‘చంద్రముఖి-2’లో హీరోగా లారెన్స్ రాఘవ నటిస్తున్నాడు. ఈ సంగతులు అలా పక్కనబెడితే ‘చంద్రముఖి’ చిత్రం రీమేక్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. మాలీవుడ్ (మలయాళం) సూపర్ హిట్ మూవీ ‘మనిచిత్రతాయ’ రీమేక్‌ ‘చంద్రముఖి’ చిత్రం.

ఈ సినిమాను తొలుత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేయాలనుకున్నారట. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్యనే తెలుగు రీమేక్‌కు దర్శకుడిగా ఫైనల్ చేశారట. కానీ, అప్పుడున్న పరిస్థితుల వలన అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అలా చిరంజీవి ఆ రీమేక్ మూవీ గురించి పక్కనబెట్టేశారట. ఈ క్రమంలోనే ‘మనిచిత్రతాయ’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆ చిత్రం బాగా నచ్చి, వెంటనే తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నాడు.. చేసేశాడు.

అలా ఆయన అనుకున్న వెంటనే దర్శకుడిగా పి.వాసును ఫైనల్ చేసుకున్నారట. అలా ఈ పిక్చర్ కు పి.వాసు స్క్రీన్ ప్లే , డైరెక్షన్ చేయగా, ఇందులో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, వడివేలు, నయనతార నటించారు. ఇక ఇందులో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది. ‘చంద్రముఖి’గా జ్యోతిక తప్ప మరెవరూ నటించలేరని సినిమా చూసి ప్రతీ ఒక్కరు ప్రశంసించారు.

ఈ చిత్రంలో తొలుత మెయిన్ హీరోయిన్ గా స్నేహను అనుకున్నారట. కానీ, ఆ పాత్రకు హోమ్లీ హీరోయిన్ స్నేహ సూట్ కాదనుకుని సిమ్రాన్ వద్దకు వెళ్లారట.

ఆ తర్వాత సిమ్రాన్ వద్దకు ఈ సినిమా వెళ్లిందట. కాగా, ఆమె అప్పటికే గర్భవతి కాగా, ఆమె చేసే పరిస్థితి తేలదు. ఇక చివరకు ఆ పాత్ర జ్యోతిక వద్దకు వచ్చింది.అలా చంద్రముఖి పాత్రలో జ్యోతిక పరకాయ ప్రవేశం చేసి ఇరగదీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version