గజ్వేల్ లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

-

గజ్వేల్ లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మొదటి గంట తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానమని.. రోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుందని వెల్లడించారు. డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు మన నినాదం కావాలని.. ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదని తెలిపారు.

తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ళ విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారని.. ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉంది. దీనికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం కూడా లేదు. బిడ్డకు తల్లి పాలు పడితే చాలు అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గేలా ప్రయత్నం చేస్తున్నాం. మా వైద్యులు, ఆశా కార్యకర్తల సహకారంతో మంచి ఫలితాలు వస్తున్నాయయ్నారు. హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశాము. ఇది విజయవంతం కావడంతో వరంగల్‌, ఖమ్మంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version