ట్రంప్ పర్యటన టైం వేస్ట్ అన్న అంతర్జాతీయ మీడియా…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు అనగానే ఎం ఒప్పందాలు ఉంటాయి…? ఆయన ఏయే ఒప్పందాలు చేసుకుంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కాని ఆయన పర్యటన వలన భారత్ కి గానీ అమెరికాకు గాను ఒరిగింది ఏమీ లేదు అనేది జనాల మాట. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే విషయం చెప్పింది. ట్రంప్ పర్యటన వలన టైం వేస్ట్ అని చెప్పింది. పెద్ద ఒప్పందాలు ఏమీ జరగలేదు అని చెప్పింది.

పాకిస్తాన్ మీడియా తో పాటుగా అమెరికా వేదికగా పని చేసే మీడియా కూడా ఇదే విషయం చెప్పింది. డాన్‌ (పాక్‌ పత్రిక) హౌడీ మోదీ సభకు ప్రతిస్పందనగా ‘నమస్తే ట్రంప్‌’ను ఏర్పాటు చేశారే తప్ప మరొకటి కాదని కొట్టిపారేసింది డాన్. గట్టి ఒప్పందాలేవీ కుదరలేదని… కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి ట్రంప్‌ సంసిద్ధత చూపారని చెప్పింది. భారత గడ్డపైనే ఈ మాటన్నారని… దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడామన్నారని చెప్పింది.

న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా తేల్చేసింది… నమస్తే ట్రంప్‌ సభను హౌడీ మోదీ-2గా చెప్పవచ్చని… ఇది ట్రంప్‌కు నిస్సంకోచంగా, ఉల్లాసపరిచేందుకు సమర్పించిన ప్రశంస.. నివాళి! అని ఎద్దేవా చేసింది. ఈ పర్యటనను ఓ కీలక శిఖరాగ్ర సదస్సుగా కంటే, సీరియస్‌ అంశాల కంటే ఓ పీఆర్‌ వ్యవహారంగా, ప్రజాకర్షకంగా మలచడానికి భారత్‌ ప్రయత్నించిందని చెప్పారు. అయితే, ఇది చిరస్మరణీయన్న విషయం కాదనలేమంటూ భారత్ తీరుని ఎండగట్టింది.

ట్రంప్‌కు కనబడకుండా అక్కడి మురికివాడలకు అడ్డంగా గోడ కట్టారని ఎద్దేవా చేసింది. ఇది భారత్‌లో అనేక వ్యాఖ్యానాలకు, విమర్శలకు తావిచ్చింది. ఆ సెగ ట్రంప్‌కూ తగిలిందన్నారు. బీబీసీ కూడా అదే విషయం చెప్పింది. ఈ పర్యటన ఎన్నికల వేళ ట్రంప్‌కు బాగా పనికొస్తుందని అభిప్రాయపడింది. భారీగా హాజరైన జనం విజువల్స్‌ను ఆయన ఉపయోగించుకుంటారని కొట్టిపారేసింది. తానంటే, అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో ఎంత మంచి పేరుందో, ప్రతిష్ఠ ఉందో తెలియజెప్పేందుకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వివరించవచ్చని బీబీసి పేర్కొంది. “పెద్ద ఒప్పందాలేవీ లేకుండానే ట్రంప్‌ పర్యటన ముగిసింది. వాణిజ్య ఒప్పందం ప్రస్తుతానికి లేనట్లే. అని చెప్పింది సిఎన్ఎన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version