ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా గాజా పట్టీలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్ శిబిరంపై దాడి చేసింది. ఐక్యరాజ్యసమితి సాయంతో నడుస్తున్న పాఠశాలపై తమ యుద్ధవిమానాలు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్, ఇతర ఉగ్రసంస్థలు ఉపయోగిస్తున్నారని ఐడీఎస్ పేర్కొంది. దాడికి ముందు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే హమాస్ అనుబంధ మీడియా అల్‌అక్సా టెలివిజన్ మాత్రం ఇజ్రాయెల్ దాడిలో 39 మంది… చనిపోయినట్లు తెలిపింది. పాలస్తీనా మీడియా వాఫా మాత్రం 32 మంది మృతి చెందారని వెల్లడించింది. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలిపింది.