BREAKING : 165 అడుగుల లోతులో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి

-

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్టర్ వేడుకల్లో పాల్గొనేందుకు చర్చికు వెళ్తుండగా ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్టర్ వేడుకల్లో పాల్గొనేందుకు చర్చికు వెళ్తుండగా ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది.ఈ ఘటనలో 45 మంది దుర్మరణం చెందగా.. ఒక్క 8 ఏళ్ల బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. 165 అడుగు లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

మొత్తం 46 మందితో కూడిన బస్సు బోట్స్‌వానా నుంచి మోరియాకు బయలు దేరి.. మార్గమధ్యలో కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడ్డట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సైతం చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్‌ చర్చ్‌ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఒకటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version