నేడు బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకం

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బ్రిటన్ రాజుగా.. ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సందడిగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఛార్లెస్‌తోపాటు ఆయన భార్య రాణి కెమిల్లాకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేస్తారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే వివిధ దేశాల  ప్రభుత్వ ప్రతినిధులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం లండన్‌కు చేరుకోగా, వారికి ఘన స్వాగతం లభించింది.  సుమారు 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

మరోవైపు బ్రిటన్ రాజుగా తన పట్టాభిషేకం అనంతరం ఛార్లెస్‌ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించనున్నారు. పట్టాభిషేక కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి, దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, పోలీసు, అత్యవసర సేవల సిబ్బందికి వీటిని అందించనున్నట్లు భారతీయ మూలాలున్న బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్‌ తెలిపారు. ఇందుకోసం ఛార్లెస్‌, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version