Delhi CM Atishi victory in Kalkaji: కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై అతిశీ గెలుపొందారు. అయితే.. మొదటి రౌండ్ నుంచి కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ వెనుకంజలో కనిపించారు. కానీ చివరలో పికప్ అందుకున్నారు. దీంతో… కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు..
కాగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు.. బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోయారు.. 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను ఓడించారు న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు.
ఇక అటు జంగ్పూరాలో మనీష్ సిసోడియాకు బిగ్ షాక్ తగిలింది. జంగ్పూరాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలిచారు. 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యారు.. సిసోడియాను జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి..గట్టెక్కించలేకపోయింది. దీంతో… తీవ్ర నిరాశకు గురయ్యారు సిసోడియా.