బ్రిటన్ కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి మరో మూడ్రోలు ఉండగా లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో మంగళవారం ఓ దుండగుడు కలకలం సృష్టించాడు. ప్యాలెస్‌లోకి తూటాలను విసిరాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్యాలెస్ సమీపంలోని రహదారులను కొద్దిసేపు మూసివేశారు. ప్యాలెస్ చుట్టుపక్కల గస్తీ పెంచారు. ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ప్యాలెస్‌లో నిందితుడు కాల్పులు జరపలేదని, అధికారులు, ప్రజలు ఎవరికీ గాయాలు కాలేదన్నారు. అతడి వద్ద అనుమానాస్పదంగా ఒక బ్యాగ్, కత్తి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఘటనా సమయంలో రాజు ఛార్లెస్, ఆయన భార్య కెమిల్లా ప్యాలెస్‌లో లేరని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని త్వరగా పట్టుకున్నారని, అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు మెట్రో పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ జోసెఫ్ మెక్‌డొనాల్డ్ తెలిపారు.
బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో మే 6వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు పలు దేశాల అధినేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవనున్నారు.