టమాటాకు టాటా చెప్పిన బర్గర్‌ కింగ్

-

పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా టమాట, పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటిదాక టమాట కిలో ధర రూ.200 దాకా పలికింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ధర తగ్గుముఖం పడుతోంది. అయినా సామాన్యులు టమాటాలను కొనుగోలు చేయలేక పోతున్నారు. కేవలం టమాటాయే కాదు.. ఇతర కూరగాయల ధరలు సామాన్యులతో పాటు మల్టీ నేషనల్‌ ఫుడ్‌ రెస్టారెంట్లను కూడా బెంబేలెత్తిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రెస్టారెంట్లు టమాటాల వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాయి. మొన్న మెక్‌డొనాల్డ్స్‌, నిన్న సబ్‌వే, తాజాగా ‘బర్గర్‌ కింగ్‌’.. టమాటాకు టాటా చెప్పింది. ‘టమాటాలకు కూడా వెకేషన్‌ అవసరం. ప్రస్తుతం టమాటాతో కూడిన ఆహారాన్ని కస్టమర్లకు అందించలేం’ అని బర్గర్‌ కింగ్‌ ఇండియా ఔట్‌లెట్స్‌ (మల్టీనేషనల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌) సోషల్‌ మీడియాలో సందేశాల్ని పోస్ట్‌ చేసినట్టు ‘రాయిటర్స్‌’ వార్తా కథనం పేర్కొంది. టమాటా, జున్ను ముక్కలు లేకుండా బర్గర్స్‌, హ్యామ్‌బర్గర్‌.. మొదలైన ఫుడ్‌ ఐటెమ్స్‌ను సరఫరా చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version