BREAKING : లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం

-

దక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడటంతో 26 మంది దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పూట ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని లిమా నుంచి 40 మందికి పైగా ప్రయాణికులతో బస్సు ఆండియన్‌ ప్రాంతానికి బయలుదేరి.. మార్గ మధ్యలో 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తొలుత గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను సమీప ఆసుపత్రికి తరలించారు. పర్వత రోడ్లు, వేగంగా వెళ్లడం, రోడ్లు దారుణంగా ఉండడం, ట్రాఫిక్‌ సంకేతాలు లేకపోవడం వంటి కారణాల వల్ల పెరూలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version