నీతి ఆయోగ్ ను పునర్నిర్మించిన మోదీ సర్కార్

-

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను పునర్నిర్మించింది. వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్న నలుగురిని శాశ్వత సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది కేంద్రమంత్రుల్లో నలుగురిని ఎక్స్అఫీషియో సభ్యులుగా, 11 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. నీతి అయోగ్‌కు ప్రధాని మోదీ ఛైర్‌ పర్సన్‌గా, ఆర్థికవేత్త సుమన్‌ కే బెరి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు.

శాస్త్రవేత్త వీకే సరస్వత్‌, వ్యవసాయ ఆర్థికవేత్త రమేశ్‌ చంద్‌, వైద్యుడు వీకే పాల్‌, స్థూల ఆర్థికవేత్త అరవింద్ విరమణి శాశ్వత సభ్యులుగా కొనసాగనుండగా.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, శివరాజ్‌ సింగ్ చౌహాన్‌, నిర్మలా సీతారామన్ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. నితిన్ గడ్కరీ, జేపీనడ్డా, హెచ్‌డీ కుమారస్వామి, జితిన్ రామ్ మాంఝీ, రాజీవ్‌ రంజన్ సింగ్, వీరేంద్ర కుమార్‌, రామ్‌మోహన్‌ నాయుడు, జుయెల్ ఓరం, అన్నపూర్ణ దేవి, చిరాగ్ పాశ్వాన్‌, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version