కమల నవ్వు భయంకరంగా ఉంటుంది.. మితిమీరిన ట్రంప్ కామెంట్స్

-

డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈసారి ఆయన కామెంట్స్ మితిమీరిపోయాయి. కమలా హ్యారిస్ భయంకరంగా నవ్వుతుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియాలోని విల్కెస్‌ – బారేలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్.. అమెరికాలోని ప్రధాన పత్రికలను కూడా తప్పుపట్టారు. కమలా హారిస్‌ నవ్వడంపై నిషేధం ఉందని.. ఆమె నవ్వు భయంకరంగా ఉంటుందని అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆమె నవ్వాలని.. తాను కూడా అదే కోరుకుంటున్నానని ట్రంప్ వెటకారంగా అన్నారు. టైమ్‌ మ్యాగజైన్‌ వద్ద కమలా హారిస్‌ ఫొటోలే లేవన్న ట్రంప్..  వారి కళాకారులు మాత్రం ఆమె డ్రాయింగ్‌ వేస్తారని ఎద్దేవా చేశారు. కమలా ఏ విషయాన్నైనా చెత్తగా చెబుతారని .. ఆమె మాటాల్లోనే అబద్ధాలు దొరికిపోతాయని ట్రంప్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version