నేనే అధ్యక్షుడినైతే.. ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకల నిషేధాన్ని పునరుద్ధరిస్తా : ట్రంప్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాను మళ్లీ అధ్యక్షుడినైతే ఏం చేస్తానో అనే హామీలను కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు హామీలు ఇచ్చిన ట్రంప్ తాజాగా మరో హామీని ప్రకటించారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని ప్రకటించారు.

రిపబ్లికన్‌ యూదు కూటమి వార్షిక సమావేశంలో డొలాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ‘ప్రయాణ నిషేధం మీకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడినైన తొలి రోజే ఆ నిషేధాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అమెరికాలో బాంబు పేలుళ్లను ఇష్టపడే వ్యక్తులు తమ దేశంలోకి ప్రవేశించాలని కోరుకోవద్దని.. అందుకే ఈ నిషేధం పునరుద్ధరిస్తానని ట్రంప్ తెలిపారు. గతంలో తమ సర్కార్ తీసుకొచ్చిన ఈ చర్య అద్భుత విజయం సాధించిందని చెప్పారు. తన హయాంలో ఒక్క దుర్ఘటన జరగకపోవడానికి చెడు వ్యక్తులను దేశంలోకి అనుమతించకపోవడమే కారణమని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇరాన్‌, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్‌, ఇరాక్‌, సూడాన్‌ వంటి దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రంప్‌ తన హయాంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనను శ్వేతసౌధం తప్పుపట్టింది. ఇస్లోమోఫోబియాకు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్‌ చర్యలు తీసుకున్నారని, ఇదే విధానాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version