బార్బిక్యూ రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం

-

బార్బిక్యూ రెస్టారెంట్​లో ఒక్కసారిగా జరిగిన అగ్నిప్రమాదం 31 మందిని బలి తీసుకుంది. ఈ ఘటన చైనాలోని ఇంచువాన్ నగరంలో చోటుచేసుకుంది. రెస్టారెంట్​లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

బుధవారం రాత్రి 8.40 గంటల సమయంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. అయితే గురువారం ఉదయం చైనా ప్రభుత్వ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందించింది. రెస్టారెంట్‌లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని చెప్పింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటన జరగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నట్లు వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version