టర్కీ, సిరియా దేశాలు వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి ఐదు వేలకు పైగా మంది మరణించారు. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు భూకంప ధాటికి అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీలోని హతయ్ ప్రావిన్స్‌లో గల ఎయిర్‌పోర్టులో ఉన్న ఒకే ఒక్క రన్‌వే ప్రకంపనల ధాటికి రెండు ముక్కలై పూర్తిగా పనికిరాకుండా పోయింది.
హతయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని రన్‌వే తీవ్రంగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను నిలిపివేశారు. భూకంప తీవ్రతకు ఒక్క టర్కీలోనే 5600లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తు కారణంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు 5000 మందికిపై మృత్యువాత పడ్డారు.
Hatay’da havalimanında Deprem sonrası pist bu hale geldi. Allah herkesin yardımcısı olsun inşallah pic.twitter.com/HuNetG5EZh
— Ankara Trafik Radar (@ankara_cevirme) February 6, 2023